తెలంగాణలో ఇవాళ అన్ని విద్యాసంస్థలకు హాలిడే

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్‌ అలర్ట్. ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలకు సెలవు ఉండనుంది. తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు ఇవాళ కూడా సెలవు ఇస్తున్నట్లు కేసీఆర్‌ ప్రభుత్వం ప్రకటించింది.

అంటే ఈ లెక్కన రేపు ఆదివారం కూడా సెలవు ఉంటుంది. సోమవారం రోజున విద్యార్థులకు ఎప్పటి లాగే… విద్యా సంస్థలు నడువనున్నాయన్న మాట. కాగా, తెలంగాణలో మరో మూడ్రోజులు వర్షాలు తప్పవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం కురుస్తున్న సమయంలో బయటకు రాకపోవడమే మంచిదని చెప్పింది. ముఖ్యంగా హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మరో 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news