ప్రతిష్ఠాత్మక జీ-20 సదస్సుకు భారత్ రెడీ అవుతోంది. దిల్లీ వేదికగా సెప్టెంబరులో ఈ సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి దేశాధినేతలు, పెద్దఎత్తున విదేశీ ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లలో ప్రభుత్వం బిజీగా ఉంది. ప్రధాన వేదిక అయిన ‘ఐటీపీఓ కాంప్లెక్స్‌ను ఆధునికీకరించింది. అధునాతన హంగులతో పూర్తయిన ఈ కాంప్లెక్స్‌ను ఈనెల 26న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రగతి మైదాన్‌కు సంబంధించిన వీడియోను కేంద్రం విడుదల చేసింది.
123 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రగతి మైదాన్ దేశంలోనే అతిపెద్ద సమావేశ సముదాయం. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్ (ఐఈసీసీ) ఇందులో ప్రధానం. దీని లెవల్-3లో ఏడు వేల మందితో భారీ సిటింగ్ సామర్థ్యం ఉంది. మూడు వేల మంది కూర్చునేలా ఓ యాంఫీ థియేటర్ నిర్మించారు. 5500కుపైగా వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. ఓవైపు భారతీయ వైభవం.. మరోవైపు ఆధునికతలను మేళవించి నిర్మించిన ఈ కాంప్లెక్స్ వీడియోను మీరూ ఓసారి చూసేయండి.
The redeveloped #ITPOComplex , which will host India’s #G20 Leaders meetings will be inaugurated on July 26, 2023
▪️Campus area of approximately 123 acres
▪️Grand seating capacity of 7,000 individuals, at Level 3 of the Convention Centre
▪️Provision of over 5,500 vehicle parking… pic.twitter.com/GNEzsXWhnG— PIB India (@PIB_India) July 24, 2023