జింబాబ్వే లీగ్: సికందర్ రాజా తుఫాన్ ఇన్నింగ్స్ … 21 బంతుల్లో 70 రన్స్ !

-

జింబాబ్వే వేదికగా జిమ్ ఆఫ్రో టీ 10 లీగ్ టోర్నమెంట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అయిదు జట్లు మొదటి టైటిల్ కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇక కాసేపటి క్రితమే జరిగిన మ్యాచ్ లో బులవాయో బ్రేవ్స్ మరియు హారర్ హర్రికేన్స్ లు తలపడ్డాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన హారర్ నిర్ణీత ఓవర్ లలో నాలుగు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అన్బతరం ఛేదన స్టార్ట్ చేసిన బులవాయో బ్రేవ్స్ మరో అయిదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదించింది. ఇందులో బులవాయో కెప్టెన్ సికందర్ రాజా తుఫాన్ ఇన్నింగ్స్ తో హారర్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రాజా కేవలం 21 బంతుల్లో 5 ఫోర్లు మరియు 6 సిక్సులు సహాయంతో 70 పరుగులు రాబట్టాడు. ఇక 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించడం విశేషం.

 

మొదటి మ్యాచ్ లో చెలరేగి ఆడిన రాజా ఆతర్వాత ఈ మ్యాచ్ లో మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు.

Read more RELATED
Recommended to you

Latest news