స్త్రీలు ఈ తప్పులు చెయ్యకూడదు.. దరిద్రమే..!

-

స్త్రీలు కొన్ని పొరపాట్లు చేస్తే ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. మంచి జరగదు. ఎప్పుడు చెడే జరుగుతుంది. స్త్రీలు ఎలాంటి పొరపాట్లు చేయకూడదనే విషయాన్ని వాస్తు పండితులు చెప్పారు మరి ఇక తెలుసుకుందాం. ఇంటికి దీపం స్త్రీ అని అంటారు. ఇంటిని అందంగా మార్చుకోవాలన్నా ఇంటిని మంచిగా ఉంచుకోవాలన్నా పిల్లలు బాగోకులు చూసుకోవాలన్నా స్త్రీ కచ్చితంగా ముఖ్య పాత్ర పోషించాలి స్త్రీ తప్పులు చేస్తే ఆ ఇల్లు అంతా కూడా ఎప్పుడూ ఇబ్బందుల్లోనే ఉంటుంది.

పిల్లలు కూడా చదువుకోలేరు. పైకి రాలేరు. మంగళవారం నాడు జుట్టు కత్తిరించకూడదని గడ్డం గీసుకోకూడదని భర్తకి స్త్రీ చెప్పాలి. స్త్రీ చెప్పకపోతే భర్త తప్పు చేస్తే ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. అమావాస్య నుండి పౌర్ణమి వరకు వచ్చేది శుక్లపక్షం. అప్పుడు మంచి పనులు చేస్తే ఎంతో శుభం కలుగుతుంది.

స్త్రీ ప్రతి రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి సాయంత్రం చీకటి పడక ముందే ఇంటిని తుడుచుకోవాలి లేదంటే ఇంట్లో దరిద్రం ఉంటుంది. లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. ఎప్పటికప్పుడు ఇంట్లో ఉండే చెత్తని తొలగించాలి పాడైపోయిన వాటిని ఇంట్లో ఉంచుకోకూడదు. సాయంత్రం అయ్యాక ఉప్పు మిరపకాయలు ఆవకాయ చింతపండు వంటి వాటిని ఎవరికీ ఇవ్వకూడదు ఈ పొరపాట్లు చేస్తే కచ్చితంగా ఆ ఇంటి దరిద్రం పట్టుకుంటుంది. లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news