టీడీపీని టార్గెట్ చేసిన పవన్..సీట్ల పంపకాల్లో తేడా.?

-

ఏపీలో రాజకీయం ఎప్పుడు ఎలా మారుతుందో అర్ధం కాకుండా ఉంది. అధికారంలో రావడం కోసం ప్రధాన పార్టీలు గట్టిగానే పోరాడుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ-టి‌డి‌పిలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అటు జనసేన సైతం కూడా ఈసారి సత్తా చాటాలని చూస్తుంది. అయితే టి‌డి‌పి-జనసేన పొత్తు పెట్టుకుని వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు.

అయితే పొత్తుపై ఇంతవరకు అధికారికంగా ప్రకటన రాలేదు. కాకపోతే మధ్య మధ్యలో ఈ సారి టి‌డి‌పి త్యాగం ఎక్కువ చేయాలని, అవసరమైతే సి‌ఎం సీటు కూడా వదులుకోవాలని జనసేన నేతలు అంటున్నారు. కానీ దీనిపై టి‌డి‌పి ఏ మాత్రం స్పందించడం లేదు. చంద్రబాబు మొదట టి‌డి‌పిని బలోపేతం చేస్తూ..వైసీపీని గట్టిగానే టార్గెట్ చేస్తూ వెళుతున్నారు. ఇక పవన్ కూడా ఈ మధ్య పొత్తుల గురించి ప్రస్తావన ఆపేశారు. కేవలం జనసేనని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో వారాహి యాత్ర పూర్తి చేశారు.

ఇప్పుడు మూడో విడత వారాహి యాత్రకు రెడీ అవుతున్నారు. అయితే తాజాగా ఆయన కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం మల్లవెల్లి పారిశ్రామిక వాడకు వెళ్ళి అక్కడ భూ నిర్వాసితులని పరామర్శించారు. ఈ క్రమంలో ఆయన టి‌డి‌పిపై విమర్శలు కూడా చేశారు. గత టి‌డి‌పి ప్రభుత్వం భూ సమీకరణ చేసి..కొందరు రైతులకే నష్ట పరిహారం ఇచ్చిందని, అది కూడా ఓ కులం రైతులకే సాయం అందించిందని ఫైర్ అయ్యారు.

రైతులని కులాల వారీగా విడగొట్టడం కరెక్ట్ కాదని ఫైర్ అయ్యారు. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం కూడా అదే చేస్తుందని, దీనిపై టి‌డి‌పి పోరాడాలని అంటున్నారు. అయితే తప్పు చేస్తే ఎవరైనైనా ప్రశ్నిస్తా అన్నట్లే పవన్ ఉన్నారు. కాకపోతే టి‌డి‌పితో పొత్తు దిశగా వెళుతున్న సమయంలో ఈ విమర్శలు చేయడం టి‌డి‌పి శ్రేణులు మండిపడుతున్నారు. పైగా ఇప్పటికే కొన్ని సీట్లలో టి‌డి‌పి-జనసేనల మధ్య పంచాయితీ నడుస్తోంది. మొత్తానికి టి‌డి‌పి-జనసేన పొత్తు సక్సెస్ అయ్యేలా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news