పాతబస్తీ అంటేనే మజ్లిస్ కంచుకోట. అలాంటి కంచుకోటలో ఎంఐఎం తిరుగులేని స్థానాల్లో బహుదూర్‌పురా ఒకటి. ఇక్కడ పోటీ అనేది లేకుండా ఎంఐఎం గెలిచేస్తుంది. అంటే ప్రతి ఎన్నికల్లో ఇక్కడ మెజారిటీ గురించి చర్చ తప్ప..గెలుపోటముల గురించి చర్చ లేదనే చెప్పాలి. 2008 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు అసిఫ్‌నగర్ సీటుగా ఉంటే..తర్వాత బహదూర్‌పురా ఏర్పడింది. అసిఫ్‌నగర్ స్థానంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ సత్తా చాటింది.
కానీ బహదూర్‌పురాలో ఎంఐఎం సత్తా చాటుతుంది. ఎంఐఎం నుంచి మౌజం ఖాన్ వరుసగా గెలుస్తున్నారు. 2009 ఎన్నికల్లో మౌజం దాదాపు 56 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక 2014 ఎన్నికల్లో ఆ మెజారిటీని మరింత పెంచుకున్నారు. ఊహించని విధంగా 95 వేల ఓట్ల మెజారిటీతో టిడిపిపై గెలిచారు. అప్పుడు టిడిపికి 11 వేలు, కాంగ్రెస్‌కు 4 వేలు, బిఆర్‌ఎస్‌కు 3 వేలు ఓట్లు పడ్డాయి. అంటే ఎంఐఎం హవా ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఇక 2018 ఎన్నికల్లో కూడా అదే దూకుడు..82 వేల ఓట్ల మెజారిటీతో ఎంఐఎం నుంచి మౌజం ఖాన్ బిఆర్‌ఎస్ పై గెలిచారు. బిఆర్‌ఎస్‌కు 14 వేలు ఓట్లు పడితే..బిజేపికి 7 వేలు, కాంగ్రెస్‌కు 7 వేలు ఓట్లు పడ్డాయి. అంటే బహదూర్‌పురాలో ఎంఐఎం వన్ సైడ్‌గా గెలుస్తుంది. మరి ఈ సారి ఎన్నికల్లో ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. పూర్తిగా ముస్లిం ఓటర్ల ప్రభావం ఉన్న బహదూర్‌పురాలో ఎంఐఎం గెలుపు అనేది ఖాయమే..ఇక చర్చ మొత్తం మెజారిటీపైనే.