ఏపీ ప్రజలకు అలర్ఠ్…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 10 నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం చేపడతామని వైద్యశాఖ తెలిపింది. స్కూళ్లు, కాలేజీల్లోని 1.10 కోట్ల మంది పిల్లలకు ఉచితంగా ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ను పంపిణీ చేస్తామని పేర్కొంది.
1-2 ఏళ్లలోపు పిల్లలు 400 ఎంజి మాత్రలో సగం మాత్రను పొడిచేసి నీళ్లలో కలిపి తీసుకోవాలి. 2-3 ఏళ్లలోపు అయితే ఒక మాత్రను పొడి చేసి నీళ్లలో కలుపుకుని తాగాలి. 3-17 ఏళ్లలోపు వారు ఒక మాత్ర వేసుకోవాలి. ఇది ఇలా ఉండగగా, ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు రేపటి నుంచి సమ్మెకు దిగనున్నారు.
రేపు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నట్లు ఉద్యోగులు ప్రకటించారు. ముందు జాగ్రత్తగా విద్యుత్ సౌధ వద్ద 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యుత్ ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో విజయవాడలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. అయితే విద్యుత్ సౌధ ముట్టడిని జేఏసీ వాయిదా వేసుకుంది.