ఒకే ఒక్కడు ఏపీ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఉంటూ, ప్రజలకు అన్నీ విధాలుగా ఉంటూ, ప్రతిపక్షాలు అన్నీ ఏకమై దాడి చేస్తున్నా సరే ఎక్కడా తడబడకుండా దూకుడు ప్రదర్శిస్తూ..మరొకసారి విజయం అందుకోవడానికి రెడీగా ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి. వన్ మ్యాన్ ఆర్మీ మాదిరిగా మళ్ళీ తన ఇమేజ్ తో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. అయితే జగన్‌ని ఓడించాలని ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు, పవన్ ఒక్కటై..ప్రతిరోజూ జగన్ ప్రభుత్వంపై మాటల దాడి ఏ స్థాయిలో చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు.
వారు ప్రజల్లో తిరుగుతూ..జగన్‌ని తిడుతున్నారు. కానీ జగన్ మాత్రం ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఇక బాబు, పవన్ మాత్రమే కాదు..ఆఖరికి పురందేశ్వరి, సిపిఐ రామకృష్ణ, నారాయణ, కాంగ్రెస్ నేతలు సైతం జగన్‌నే టార్గెట్ చేస్తున్నారు. ఇలా అన్నీ వైపులా నుంచి జగన్ ప్రభుత్వంపై దాడి జరుగుతుంది. ఇటు వైసీపీ నేతలు కూడా అదే స్థాయిలో ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇస్తున్నారు. కాకపోతే వైసీపీ నేతల వల్ల ఒకోసారి మైనస్ కూడా అవుతుంది. ఓ వైపు కొందరు నేతలు సరిగ్గా పనిచేయడం లేదు. ఒకోసారి అనవసరమైన మాటల దాడి చేస్తూ..సొంత పార్టీకే నష్టం చేస్తున్నారు.
అయినా సరే జగన్ ఎక్కడా కూడా పార్టీ బలం తగ్గకుండా మరో వైపు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఆయన ప్రజలకు మంచి చేస్తూనే.. పార్టీ బలం పెంచేలా ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రతిపక్షాలపై పెద్దగా విమర్శలు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కేవలం ప్రజల కోసమే పనిచేయడంపై దృష్టి పెట్టారు.
అంటే అన్నీ వైపులా నుంచి దాడి జరుగుతున్నా తాను మాత్రం ప్రజల కోసం నిలబడుతున్నారు. అందుకే వన్ మ్యాన్ ఆర్మీ లెక్క పోరాడుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో జగన్ ఇమేజ్ బట్టే వైసీపీ గెలవాల్సింది తప్ప..నాయకుల బట్టి కాదనే చెప్పాలి. ఎలాగో 50 శాతం మద్ధతు జగన్‌కే ఉంది. కాబట్టి ప్రజలు మళ్ళీ జగన్‌ని గెలిపించుకోవడం ఖాయమని చెప్పవచ్చు.