విశాఖ చేరుకున్న జనసేన అధినేత పవన్

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు పవన్ కు ఘనస్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా దసపల్ల హోటల్ కు జనసేనాని బయలుదేరారు. అక్కడే బస చేసి సాయంత్రం 5 గంటలకు జగదాంబ సెంటర్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు.

నేటి నుంచి ఈనెల 19వ తేదీ వరకు విశాఖ జిల్లాలో పవన్ వారాహియాత్ర జరగనుంది. కాగా, పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు హరి రామ జోగయ్య. జనసేన వారాహి పవన్ కళ్యాణ్ విశాఖ యాత్ర పై మాజీ మంత్రి హరి రామ జోగయ్య విశ్లేషణ చేశారు. తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలో వారాహి యాత్ర జన ప్రభంజనం ఎలా అయితే కనిపించిందో అదే రీతిలో విశాఖ యాత్ర కూడా కనిపించబోతుందనేది రాజకీయ పరిశీలకులలో ఆత్రుత కనబడుతోందని వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పరిపాలనలో మార్పు కోరుకుంటున్న ప్రజలు నీతిపరుడైన పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టాలని ఆత్రుతతో ప్రజానీకం ఉన్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news