రెండు నెలలుగా ప్రజలను ఎంతగానో ఇబ్బంది పెడుతున్న టమోటా ధరలు కొంచెం తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు కిలో టమోటా ధర రూ. 150 కు పైగానే ఉందన్న విషయం తెలిసిందే. ఒకానొక దశలో అయితే రూ. 200 కు కూడా చేరింది, అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ వారంలో మాత్రం టమోటా ధరలు మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ లో నిన్న ఒక కిలో టమోటా ధర చూస్తే రూ. 100 గా ఉంది. కానీ ఈ రోజు మార్కెట్ లో ధరలను ఒకసారి చూస్తే గ్రేడ్ ఏ రకం టమోటా కిలో రూ. 50 లు నుండి రూ. 64 లు వరకు పలకడం విశేషం. దీనితో మదనపల్లె లోనే ఈ ధరలు ఉండగా … ఇప్పుడు ఇతర ప్రదేశాలలో కొంచెం పెరిగినా రూ. 100 లోపు కిలో టమోటా దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
టమోటా ధరలు పెరిగిన తీరుతో భయభ్రాంతులకు గురైన ప్రజలు టమోటాలు బదులుగా చికెన్ కొనుగోలు చేసి ఫ్రై చేసుకుని తిన్న సంఘటనలు ఉన్నాయి. ఇక ఈ వార్త మాత్రం నిజంగా సామాన్యులు అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి.