IFFM అవార్డులు.. బెస్ట్ మూవీగా ‘సీతారామం’.. ఉత్తమ సిరీస్‌గా ‘జూబ్లీ’

-

సీతారామం సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. అయినా ఈ మూవీకి ఉన్న క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గడం లేదు. ఇక ఈ సినిమాకు ఇప్పటికే పలు అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కించుకుంది. ‘ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌’ (Indian Film Festival of Melbourne) బెస్ట్‌ ఫిల్మ్‌గా నిలిచింది.

మెల్‌బోర్న్‌ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలు ఈ నెల 20 వరకు జరగనున్నాయి. తొలి రోజైన శుక్రవారం పలు విభాగాలకు సంబంధించిన అవార్డులను IFFM టీమ్‌ ప్రకటించింది. ఉత్తమ సిరీస్‌గా ‘జూబ్లీ’, ఉత్తమ డాక్యుమెంటరీగా ‘టు కిల్‌ ఏ టైగర్‌’ నిలిచాయి. రాణీ ముఖర్జీ (మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే) బెస్ట్‌ యాక్టర్‌- ఫిమేల్‌, మోహిత్‌ అగర్వాల్‌ (ఆగ్రా) బెస్ట్‌ యాక్టర్‌- మేల్‌, పృథ్వీ కొననూర్‌.. బెస్ట్‌ డైరెక్టర్‌, మృణాల్‌ ఠాకూర్‌.. డైవర్సిటీ అవార్డు అందుకున్నారు. బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ సిరీస్‌ విభాగంలో రాజ్‌శ్రీ దేశ్‌పాండే (ట్రయల్‌ బై ఫైర్‌), విజయ్‌ వర్మ(దహాడ్‌) అవార్డు పొందారు.

Read more RELATED
Recommended to you

Latest news