గన్ మెన్లను తీసేయండి… తాడిపత్రి ప్రజలే నన్ను కాపాడుకుంటారు !

-

తన గన్‌ మెన్లను తొలగించారని..జెసి ప్రభాకర్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. 2+2 గన్ మెన్లు ఉంటే ఒకరి ని తొలగించారు … ప్రస్తుతం ఒక్కరే గన్ మ్యాన్ ఉన్నాడని మండిపడ్డారు. గన్ మెన్లను తీసేయండి… తాడిపత్రి ప్రజలే నన్ను కాపాడుకుంటారు…పీడీ యాక్టు లోపలకి పంపుతారా… పంపండి అన్నారు జెసి ప్రభాకర్ రెడ్డి. ప్రహారీ గోడ నిర్మాణం సమయంలో బందోబస్తు కోసం మూడు రోజుల పాటు రూ.25 లక్షల ప్రజల సొమ్ము ఖర్చు చేశారని..ఎమ్మెల్యేల కోసం ఎస్పీలు పని చేస్తున్నారా…అని నిలదీశారు.

బస్సులు , నా ఆస్తులు అన్ని పీక్కుకున్నారు…ఇంకా నాదగ్గర ఏమి లేదని పేర్కొన్నారు. నేను బ్రతికి ఉండగా ఈ కేసులు అయిపోవు… ఇప్పటి వరకు 77 కేసులు పెట్టారన్నారు. బెర్లిన్ వాల్ ఎలా పగులగొట్టారో …. తాడిపత్రిలో కూడా అదే జరుగుతుందని.. సద్దాం హుస్సేన్ బంకర్ లో దాక్కుఉన్న ఎలా పట్టుకోచ్చారో అందరికీ తెలుసని వెల్లడించారు జెసి ప్రభాకర్ రెడ్డి. మా కుటుంబం అంటే డిఎస్పీ గంగయ్యకు సరిపోదని.. సాక్ష్యాధారాలతో సహా అన్ని నిరూపిస్తానని స్పష్టం చేశారు జెసి ప్రభాకర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news