నేడే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ

-

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి కేసిఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు.  దాదాపు సిట్టింగులకే సీట్ ఇచ్చిన సీఎం.. సీట్ రాని అభ్యర్థులకు ప్రత్నామ్యాయ అవకాశం ఇస్తానని. హామీ ఇచ్చినట్లు టాక్. ఇందులో భాగంగా  ఇవాళ మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు.

. అమాత్యుడిగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, రంగారెడ్డి కీలక గులాబీ నేత పట్నం మహేందర్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సమక్షంలో ప్రమాణం చేయనున్నారు. రెండోసారి సీఎం కేసీఆర్‌ అధికారం చేపట్టాక.. రెండోసారి విస్తరణ చేపడుతున్నారు.

ఆరోగ్యశాఖ మంత్రిగా నేడు మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారనే టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక ఖాళీ ఉంది. కేబినెట్ నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసినప్పటి నుంచి ఆ ఖాళీ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో రాజకీయ అంశాలు దృష్టిలో పెట్టుకొని దీనిని భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి రాజ్‌భవన్‌కి సమాచారం వెళ్లినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news