క్రూరమృగాలు అంటే మనకు పులులు, సింహాలే గుర్తుకువస్తాయి. కానీ అలాంటి పులులను సైతం చంపేయగల అతి క్రూర జంతువు కూడా ఉంది.
అదే కుక్క.. కుక్క క్రూర జంతువా..! ఇళ్లల్లో పెంచుకుంటాం కదా అంటారా..! కానీ క్రూరమైన కుక్కల గురించి తెలిస్తే శునకాలు కూడా ఇంత డేంజరా అనుకుంటారు.
రొట్ వెయిలెర్ కుక్క విపరీతమైన బలాన్ని కలిగి ఉంటుంది. బాడీ బిల్డర్ లాగా శరీర నిర్మాణం ఉంటుంది. సింహాన్ని కూడా తన ప్రమాదకరమైన దవడలతో కొరికి చంపగలదనీ… ఒకసారి దాని దవడలతో దేనినైనా పట్టుకుంటే.. ఇక వదిలిపెట్టడం కష్టమట.
టిబెటన్ మాస్టిఫ్‌ను కుక్కల్లో రాజుగా పిలుస్తారు. ఈ కుక్కలు తమ యజమానితో ఉండటానికి ఇష్టపడతాయి. చాలా రక్షణగా ఉంటాయి. కాబట్టి ఈ కుక్కలు తమ ప్రజల కోసం ఏదైనా చేయడానికి అన్ని విధాల సిద్ధంగా ఉంటాయి. అవసరమైతే సింహాన్ని కూడా చంపేస్తాయట. బోర్‌బోయెల్ జాతి కుక్కల స్వస్థలం దక్షిణాఫ్రికా. ఇది దాని ఫిట్‌నెస్, దూకుడుకు చాలా ప్రసిద్ధి చెందింది.
ఈ కాకేసియన్ షెపర్డ్ కుక్క, దాని బలం, రక్షణ కల్పించడంలో ప్రసిద్ధి చెందింది. ఈ కుక్కకు సింహాన్ని కూడా ఎదుర్కొనేంత శక్తి ఉందని తేల్చారు.
కంగల్ టర్కీకి చెందిన జాతి కుక్క. తన యజమానికి విపత్తు వస్తే కాపాడటానికీ, ప్రాణాలను అర్పించడానికీ ఈ కుక్కలు ఏమాత్రం వెనకాడవు. అందువల్ల ఇవి సింహాన్ని కూడా ఏమాత్రం లెక్కచెయ్యవట..
డోగో అర్జెంటీనో అనేది అర్జెంటీనాకు చెందిన కుక్క జాతి. పరుగు, వేటలో ఇవి సింహాలను మించిపోతాయి.
దక్షిణాఫ్రికాకు చెందిన రోడేసియన్ రిడ్జ్‌బ్యాక్ కుక్కలను చాలా కాలంగా సింహాలను వేటాడేందుకు ఉపయోగిస్తున్నారు. ఇవి చురుకైన, నైపుణ్యం కలిగిన వేట కుక్కలు.
అమెరికన్ పిట్ బుల్ టెర్రియర్‌ని ఒకప్పుడు వేట కోసం ఉపయోగించారు. ఇది చాలా శక్తిమంతమైన కుక్క. ఇది సింహాన్ని కూడా చంపగలదని దీని సంరక్షులు అంటున్నారు.
కేన్ కోర్సో ఒకప్పుడు వేటకు ప్రసిద్ధి చెందిన ఇటలీకి చెందిన కుక్క. ఇప్పుడు కూడా సింహాలను కంట్రోల్ చెయ్యడంలో ఈ కుక్కలు తమ సత్తా చూపిస్తున్నాయి.
ఈ కుక్కలు కేవలం సింహాలనే కాదు.. మనుషులను సైతం ముక్కలు ముక్కలుగా. చేసుకుని తినేస్తాయి. అమెరికన్ పిట్ బుల్ జాతి కుక్కల వల్ల ఎంతోమంది చిన్నారులు చనిపోయారు.