NTR రూ.100 నాణెం : మార్కెట్ లో చలామణి కాదు : వీఎన్ఆర్ నాయుడు

-

భారతీయ సినిమా, రాజకీయ రంగంపై చెరగని ముద్ర వేసిన నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఓ స్మారక నాణేన్ని విడుదల చేసింది. దేశంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారి స్మారకార్థం ఈ తరహాలో స్మారక నాణేలను విడుదల చేయడం కొత్తేమీ కాదు.ఈ నాణెం గురించి హైదరాబాద్ మింట్ ఛీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు మీడియాకి  ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

తొలిసారిగా ఓ స్మారక నాణాన్ని “హైదరాబాద్ మింట్” ముద్రించింది. ఎన్.టి.ఆర్ స్మారక నాణెం తొలి నాణెం కావడం సంతోషకరంగా ఉందన్నారు. ఎన్.టి.ఆర్ అభిమానులను ఖచ్తితంగా అలరిస్తుందనే నమ్మకం మాకుంది. ఇప్పటికీ 14 వేల నాణేలు ముద్రించాం. ఉన్న డిమాండ్ ను బట్టి మొత్తం 50 వేలు నాణాలు ముద్రించే అవకాశం ఉంది. ఎన్.టి.ఆర్ నాణెం 35 గ్రాముల బరువు తో, 44 మిల్లీమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఎన్.టి.ఆర్ నాణాన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం జింక్, మరో 5 శాతం నికెల్ ఖనిజంతో రూపొందించాం.తర్వాత కావాలంటే దొరికే అవకాశం ఉండదు కాబట్టి, ఎన్.టి.ఆర్ అభిమానులంతా ముందుగానే కొనుగోలు చేయడం ఉత్తమం అని తెలిపారు.

ప్యాకేజీని బట్టి నాణెం ధర ఉంటుందని.. ఒక నాణెం ధర రూ.3050 నుంచి రూ. 4,850 వరకు ఉంటుంది. ఎన్.టి.ఆర్ ముఖ కవళికలు మెరుస్తూ, ప్రస్పుటంగా కనబడేలా,”ఫ్రాస్టింగ్” చేసిన నాణెం ధర మరో 500 రూపాయలు అదనంగా ఉంటుంది. ఎన్.టి.ఆర్ నాణెం కు ఉండే డిమాండ్ ను బట్టి ముద్రించేందుకు కావాల్సిన ముడి సరుకును సమకూర్చుకుని, సాధ్యమైనంత వేగంగా అదనపు నాణాలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news