బీజేపీ పెద్దల మెప్పు కోసం చంద్రబాబు లాబీయింగ్ : సీదిరి అప్పలరాజు

-

చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. కుప్పంలో దొంగ ఓట్లతోనే ఆయన గెలుస్తున్నాడని మంత్రి సీదిరి అన్నారు. కుప్పంలోనే 30 నుంచి 40వేల బోగస్‌ ఓట్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. కుప్పంలో దొంగ ఓట్లు పోతాయనే భయంతో బాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడంటూ మంత్రి మండిపడ్డారు.

జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తోందో చెప్పాలి: మంత్రి సీదిరి - Manalokam

చాలాసార్లు బీజేపీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో ఎన్టీఆర్‌ పేరు మీద స్పాన్సర్డ్‌ కార్యక్రమం పెట్టి బీజేపీ నేతలతో లాబీయింగ్‌ చేశాడు అని సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ బొమ్మతో ఓట్లు లబ్ధి పొందాలనేదే చంద్రబాబు తాపత్రయం.. ఎన్టీఆర్‌కు ప్రత్యేక గుర్తింపు కావాలనే ఆలోచన బాబుకు లేదు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.

ఇదే సమయంలో విశాఖ మత్య్సకారుల సమస్యలపై కూడా మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు. విశాఖలో మత్స్యకారుల సమస్య ఈనాటిది కాదు. గత ముప్పై ఏళ్ల కింద ఇచ్చిన హామీ అమలు కాలేదు. విశాఖ మత్స్యకారుల సమస్య పరిష్కారం కోసం కలెక్టర్తో మాట్లాడాను. మత్స్యకారులకు ఇళ్ల స్థలాలు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాం’ అని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news