బీఆర్ఎస్ నేతల తీరు గురివింద గింజలా ఉంది : కిషన్‌ రెడ్డి

-

కేంద్ర ప్రభుత్వం ఇంటి సిలిండర్‌పై రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. కేంద్రం నిర్ణయంపై బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలకు వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్యాస్ ధరలపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని అన్నారు. బీఆర్ఎస్ నేతల తీరు గురివింద గింజలా ఉందన్నారు కిషన్‌ రెడ్డి. దేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తెలంగాణలోనే ఎక్కువగా వున్నాయని ఆరోపించారు. పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా వ్యాట్ తగ్గిస్తే సీఎం కేసీఆర్ ఇక్కడ ఎందుకు తగ్గించలేదో చెప్పాలన్నారు కిషన్‌ రెడ్డి.

Minister by Day, Student by Night: G Kishan Reddy Polishes His Hindi With  Help from BJP 'Karyakarta' - News18

రోజువారీ ఖర్చుల కోసం భూములు అమ్మే పరిస్థితి వచ్చిందని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. భూములు అమ్మకుండా, మద్యం అమ్మకుండా ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదని కిషన్‌ రెడ్డి అన్నారు. ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందన్నారు. రోడ్లను కూడా తాకట్టు పెట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. తాత్కాలిక అవసరాల కోసం ఓఆర్ఆర్‌ను ముప్పై ఏళ్లకు లీజుకు ఇచ్చారన్నారు.

మాజీ గవర్నర్ విద్యాసాగర రావు తనయుడు చెన్నమనేని వికాస్ బుధవారం కిషన్ రెడ్డి, బండి సంజయ్, డాక్టర్ కె లక్ష్మణ్‌ల సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ రెండుసీట్లు గెలవడం ఖాయమని కిషన్‌ రెడ్డి జోస్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news