ముందు నుయ్యి..వెనుక గొయ్యి..ఇదే ఇప్పుడు చంద్రబాబు పరిస్తితి. వచ్చే ఎన్నికల్లో గెలవడం అనేది చావో రేవో లాంటిది. ఇప్పటికే అధికారానికి దూరమై..జగన్ చేతిలో చావు దెబ్బతిన్నారు. టిడిపికి చాలా వరకు డ్యామేజ్ జరిగింది. మళ్ళీ గాని జగన్ అధికారంలోకి వస్తే టిడిపి మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో టిడిపికి అధికారంలోకి రావడం ముఖ్యం.
కాకపోతే ఇప్పుడున్న పరిస్తితుల్లో టిడిపికి బలం పూర్తిగా పెరగలేదు. ఇంకా వైసీపీకే ఆధిక్యం ఉంది. ఈ సమయంలో బాబు పొత్తుల దిశగా వెళ్లాలని చూస్తున్నారు. దీంతో జనసేనతో కలిసి ముందుకెళితే ఓట్లు చీలిపోకుండా వైసీపీకి చెక్ పెట్టవచ్చు అనేది బాబు ప్లాన్. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి మద్ధతు పొందితే..అధికార బలం కూడా వస్తుందని, ఇది ఎన్నికల సమయంలో ప్లస్ అవుతుందని బాబు చూస్తున్నారు. సరే పొత్తుల వల్ల లాభాలు ఎలా ఉన్నాయి..నష్టాలు అలాగే ఉన్నాయి. ముఖ్యంగా బిజేపితో కలవడం వల్ల టిడిపికి డ్యామేజ్. ఎలాగో ఏపీలో బిజేపికి బలం శూన్యం.
పైగా రాష్ట్ర ప్రయోజనాలని పట్టించుకొని బిజేపిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఇది కాస్త టిడిపిపై ప్రభావం చూపుతుంది. అదే సమయంలో బిజేపికి, జనసేనకు ఇచ్చే సీట్లలో టిడిపి ఓట్లు పెద్దగా బదిలీ కావు. దీని వల్ల ఆయా సీట్లలో నష్టం తప్పదు. ఇది పొత్తు ఉంటే..ఒకవేళ పొత్తు లేకపోతే వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి. టిడిపికి నష్టం జరుగుతుంది.
అంటే ఎటు వచ్చిన టిడిపికే డ్యామేజ్ తప్పదు. ఇలాంటి తరుణంలో బాబు ఎలా ముందుకెళ్తారనేది చూడాల్సి ఉంది. పోనీ కేవలం జనసేన కలిసి వెళ్లాలంటే..ఆ పార్టీ..బిజేపిని వదిలి వస్తుందో లేదో చెప్పలేం. అలా అని బిజేపి..పరోక్షంగా వైసీపీకి సహకరితే మళ్ళీ అదొక తలనొప్పి. ఎటు చూసుకున్న బాబుకే నష్టం..అందుకే ముందు నుయ్యి..వెనుక గొయ్యి.