సర్వేలు వైసీపీ వైపే..బాబు ప్లాన్ అదే.!

-

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ఈ సారి అధికారం దక్కించుకోవడం కోసం అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టి‌డి‌పిలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇప్పుడు అధికారంలో ఉంటూ టి‌డి‌పికి చుక్కలు చూపించిన వైసీపీ..మళ్ళీ అధికారంలోకి రాకపోతే..టి‌డి‌పి ఏం చేస్తుందో చెప్పాల్సిన పని లేదు. అదే సమయంలో వైసీపీ చేతిలో చావు దెబ్బలు తిని ఉన్న టి‌డి‌పి..ఈ సారి అధికారంలోకి రాకపోతే పరిస్తితి పార్టీ మనుగడ ప్రమాదంలో పడుతుంది.

అందుకే రెండు పార్టీలు ఈ సారి ఎన్నికల్లో భారీ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఏపీలో గెలుపోటములపై జరిగే పలు సర్వేల్లో వైసీపీదే అధికారమని తేలుతుంది. అటు జాతీయ సర్వేలు సైతం వైసీపీకే పట్టం కడుతున్నాయి. క్లియర్ గా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని తేలిపోతుంది. ఇలాంటి నేపథ్యంలో వైసీపీని కట్టడి చేయడానికి చంద్రబాబు తన వ్యూహాలు పదును పెట్టే పనిలో ఉన్నారు. ఎలాగో వైసీపీ ప్రభంజనాన్ని సింగిల్ గా ఆపడం కష్టమని ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. అందుకే జనసేనతో కలవడానికి రెడీ అయ్యారు.

ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బి‌జే‌పి సపోర్ట్ లేకపోతే..ఎన్నికల సమయంలో అధికారుల మద్ధతు దక్కదు. గత ఎన్నికల్లో రాష్ట్రం టి‌డి‌పి అధికారంలో ఉన్నా సరే..పైన కేంద్రంలో బి‌జే‌పి ఉండటంతో..టి‌డి‌పిని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో అన్నిరకాలుగా పెట్టారు. పరోక్షంగా వైసీపీకి సహకరించారు. అందుకే ఈ సారి బి‌జే‌పి సహకారం కోసం బాబు చూస్తున్నారు.

ఈ క్రమంలో బి‌జే‌పితో పొత్తుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో బి‌జే‌పికి ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వడానికి వెనుకాడటం లేదని తెలుస్తోంది. ఏదేమైనా బి‌జే‌పి మద్ధతు పొందడమే బాబు టార్గెట్. ఆ దిశగానే ముందుకెళుతున్నారు. అయితే కేంద్రంలోని బి‌జే‌పికి అన్నీ తెలుసు..రాష్ట్రంలో ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారని తెలుసు. అలాంటప్పుడు బి‌జే‌పి..తెలిసి తెలిసి టి‌డి‌పికి మద్ధతు కష్టమే. మొత్తానికి బాబుకు మళ్ళీ దెబ్బపడేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news