విదేశాల్లో ఉన్న పిల్లలకు పంపే డబ్బుపై ట్యాక్స్‌ బెనిఫిట్స్‌ ఉంటాయి తెలుసా..?

-

తల్లిదండ్రులు పిల్లలకు మెరుగైన విద్య, గొప్ప భవిష్యత్తు ఇవ్వాలని విదేశాలకు పంపడం నేడు చాలా సాధారణమైన విషయం అయిపోయింది. వాళ్లకు అక్కడ ఖర్చుల కోసం ఇక్కడ నుంచి నెల నెల ఎంతో కొంత డబ్బు పంపిస్తుంటారు. పిల్లల చదువు కోసం విదేశాలకు పంపే డబ్బుపై ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు తెలుసా..? ఈ విషయంలో చాలా మందికి ఇప్పటికీ సందేహాలు ఉన్నాయి. అయితే ఇలా పంపించే మనీని గిఫ్ట్‌గా పరిగణించవచ్చని ట్యాక్స్ నిపుణులు అంటున్నారు.

సాధారణంగా అనేక దేశాలు స్వదేశంలో పే చేసే విద్యా ఖర్చులపై ట్యాక్స్ డిడక్షన్స్ అందిస్తాయి. మరి పిల్లల చదువు కోసం విదేశాలకు పంపే డబ్బుపై ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చా? అనే సందేహం అందరిలో ఉంటుంది. అయితే ఇలా పంపించే మనీని గిఫ్ట్‌గా పరిగణించవచ్చని ట్యాక్స్ నిపుణులు అంటున్నారు. ఆదాయపు పన్ను శాఖ (ITD) రూల్స్ ప్రకారం, గిఫ్ట్స్‌పై పన్ను డిడక్షన్ ఉంటుంది. కాకపోతే ఒక పరిమితి లోపే ఈ ట్యాక్స్ డిడక్షన్స్‌కు అర్హత ఉంటుంది.

బహుమతులపై డిడక్షన్ : ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 లోపు ఉన్న బహుమతులకు ట్యాక్స్ డిడక్షన్ వర్తిస్తుంది. అంటే గిఫ్ట్ గ్రహీత దానిపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు, అది ఒకేసారి పొందినా లేదా అనేక లావాదేవీలలో పొందినా పన్ను వర్తించదు. గిఫ్ట్స్‌ విలువ రూ.50,000 దాటితే, ఆ రూ.50 వేలకు మించిన అమౌంట్ గ్రహీత ఆదాయంలో భాగంగా పరిగణిస్తారు. తదనుగుణంగా పన్ను లెక్కిస్తారు.

రూ.50,000 డిడక్షన్ లిమిట్ అనేది గిఫ్ట్ అమౌంట్‌ను తగ్గించదు. గిఫ్ట్ వాల్యూ రూ.50,000 కంటే ఎక్కువ ఉంటే, పన్ను ప్రయోజనాల కోసం టోటల్‌గా గిఫ్ట్ అమౌంట్‌ను డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. డిడక్షన్ మొదటి రూ.50,000కి మాత్రమే వర్తిస్తుంది. పన్ను రేట్లు అమౌంట్ బట్టి వర్తిస్తాయి.

తల్లిదండ్రులు, పిల్లలతో సహా నిర్దిష్ట కుటుంబ సంబంధాల విషయంలో ఐటీ శాఖ గిఫ్ట్ ఎగ్జమ్షన్స్‌ అందిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, విదేశాల్లో విద్య కోసం తండ్రి తన పిల్లలకు పంపిన డబ్బుకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. తండ్రి-పిల్లల సంబంధాన్ని “ప్రత్యేక సంబంధంగా పరిగణిస్తారు.

పేరెంట్స్ ట్యూషన్, లివింగ్ ఎక్స్‌పెన్‌సివ్స్‌ లేదా ఇతర విద్యా ఖర్చుల కోసం పంపించినా, ఆ మొత్తం డబ్బుకు ట్యాక్స్ ఎగ్జమ్షన్ వర్తిస్తుంది. అందువల్ల కుమార్తెకు తల్లిదండ్రులు పంపిన డబ్బుపై పన్నులు చెల్లించాల్సిన అవసరం రాదు. పిల్లలకు పంపే డబ్బుకు ఎగ్జమ్షన్‌తో పాటు విదేశాల్లోని బంధువులకు పంపే డబ్బుకు కూడా ఎగ్జమ్షన్ ఉంటుంది. బంధువులకు ట్యాక్స్‌-ఫ్రీగా పంపగల డబ్బు మొత్తం ఆర్థిక సంవత్సరానికి రూ. 2.5 లక్షలుగా ఐటీ శాఖ నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news