స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు తన స్కిల్ చూపించాడు – నందిగం సురేష్

-

తాడేపల్లి: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో టిడిపి అధినేత నారా చంద్రబాబు తన స్కిల్ చూపించాడనే ఏద్దేవా చేశారు వైసీపీ ఎంపీ నందిగాం సురేష్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్కామ్ లో వాటాలు పంచుకున్న వాళ్లంతా తెగ బాధపడుతున్నారని అన్నారు. బావ కళ్ళల్లో ఆనందం కోసం పురందేశ్వరి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

బిజెపిలో ఉండి టిడిపి నేతలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు స్కామ్ లు ఇంకా చాలా ఉన్నాయని.. అన్ని బయటకు వస్తాయన్నారు. ఇక మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చంద్రబాబుకి శిక్ష పడడం ఖాయం అన్నారు. టిడిపి నేతలు ఈ స్కాం గురించి మాట్లాడకుండా సొల్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా కాకుండా చంద్రబాబు వదినలా మాట్లాడుతుందని.. చంద్రబాబుని అడ్డుపెట్టుకొని ఎంపీ కావాలని చూస్తుందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news