కోలీవుడ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించిన “జైలర్” మూవీ !

-

గత మూడు వారాల క్రితం సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన మాస్ ఫామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ జైలర్ సినిమా విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను ప్రేక్షకులకు నచ్చే విధంగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుంటు తెరకెక్కించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 630 కోట్ల కు పైగా కలెక్ట్ చేసి ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకుంది. తాజాగా మరో రికార్డును దక్కించుకుని చరిత్రను తిరగరాసింది. ఈ సినిమా కేవలం ఒక్క తమిళనాడు లోనే రూ. 100 కోట్లు షేర్ ను కాలేచ్ట్ చేసి కోలీవుడ్ సినిమా పరిశ్రమలోనే కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కాగా మూడు రోజుల క్రితమే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో విడుదల అయ్యి నెంబర్ వన్ లో ట్రెండ్ అవుతోంది.

ఈ సినిమా విజయంలో రజినీకాంత్ మాత్రమే కాకుండా … ప్రత్యేక పాత్రలలో అదరగొట్టిన తమన్నా, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ మరియు సంజయ్ దత్ లు కూడా దోహదపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news