చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారు : కొడాలి నాని

-

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఏపీ సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై వైసిపి మంత్రులు,నేతలు స్పందిస్తున్నారు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అడ్డంగా దొరికారని, పూర్తి ఆధారాలతోనే అరెస్ట్ చేశారని వైసీపీ మంత్రులు, నేతలు చెప్తున్నారు. తాజాగా చంద్రబాబును ఏపీ సిఐడీ అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. ఇంతకాలం వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబు పాపం పండిందని ట్విట్టర్ వేదికగా కొడాలి నాని పోస్ట్ చేశారు.

Kodali Nani Allegedly Suffering From Cancer?

చంద్రబాబు ఓ 420 అని, అవినీతి చక్రవర్తి అని స్వర్గీయ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు ఈ అవినీతిలో అడ్డంగా దొరికిపోయారన్నారు. పాలు, పెరుగు, పిడకలు అమ్మే చంద్రబాబుకు వేల కోట్లు, లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. టీడీపీ లేదా చంద్రబాబుకు డప్పు కొట్టేవారు వీటికి సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు దొరికిన దొంగ అన్నారు. తనను అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news