చంద్రబాబుకు నా మద్దతు ఉంటుంది: పవన్ కళ్యాణ్

-

చంద్రబాబుకు ఎప్పటికీ తన మద్దతు ఉంటుందని జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ‘చంద్రబాబును అరెస్టు చేసి తీసుకువస్తుంటే నా మద్దతు ఉంటుందని చెప్పాను. ఇప్పటికీ, ఎప్పటికీ ఆయనకు నా మద్దతు ఉంటుంది. చట్టాలు సరిగా పనిచేస్తే బెయిల్ మీద వచ్చిన వాళ్లు సీఎం కాలేరు’ అని జనసేన సమావేశంలో పవన్ వ్యాఖ్యానించారు. దేశంలో జీ20 సమావేశాలు జరుగుతున్న సమయంలో… ఏపీ ముఖ్యమంత్రి జగన్ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత కీలకమైన సమ్మిట్ జరుగుతున్న సమయంలో… ఈ వ్యక్తి జగన్ మొత్తం నాశనం చేశారని చెప్పారు. జగన్ కోసం కేంద్రం ఎంతో చేస్తే… కేంద్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ20ని జగన్ చంపేశారని అన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Pawan Kalyan: చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ పై పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే.. |  janasena chief pawan kalyan reaction on chandrababu arrest, and remand by  acb court - Telugu Oneindia

వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని వ్యవస్థలను జగన్ చంపేశాడని, వివేకాను చంపేసిన వ్యక్తి బయట తిరుగుతున్నాడని మండిపడ్డారు. ఎంతో ప్రజాదరణ ఉన్న తనను, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును రోడ్ల మీద తిరగనీయకుండా ఆపేస్తున్నారంటే… ఈ విషయంపై రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలని చెప్పారు. రాష్ట్ర పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం మార్చేసిందని మండిపడ్డారు. మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్… అదే మద్యాన్ని వ్యాపారంగా మార్చుకున్నారని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news