టీడీపీ అధినేత చంద్రబాబు జైలు పాలయ్యారు. స్కిల్ కేసులో అరెస్ట్ అయ్యి..14 రోజుల పాటు రిమాండ్ లోకి వెళ్లారు. అయితే బాబు తప్పులు చేయడం వల్లే అరెస్ట్ అయ్యారని..అధికార వైసీపీతో పాటు టిడిపి వ్యతిరేక వర్గాలు చెబుతున్నాయి. కాదు ఇదంతా కక్షపూరితంగానే జరుగుతుందని, బాబుని కావాలని అరెస్ట్ చేశారని టిడిపి శ్రేణులు అంటున్నాయి. అదే సమయంలో ఢిల్లీ పెద్దల సపోర్ట్ లేకుండా ఇదంతా జగన్ చేయరని, అంటే ఈ కుట్రలో బిజేపి పెద్దలు కూడా ఉన్నారని, అందుకే టిడిపి నిరసనలకు జనసేన మద్ధతు ఇచ్చిన బిజేపి సపోర్ట్ ఇవ్వలేదని తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు.
ఇదంతా మోదీ, అమిత్ షా డైరక్షన్ లోనే జరిగిందని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు వెనక కచ్చితంగా మోదీ, అమిత్ షా మద్దతు ఉందని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బీజేపీని నమ్మొద్దని దూరంగా ఉండాలంటూ ఆయన సూచించారు.
అయితే బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో టీడీపీని తమతో కలుపుకు వెళ్లాలనేది పవన్ ఆలోచన. ఈ సమయంలో చంద్రబాబు అరెస్ట్ జరిగింది. ఇలాంటి సమయంలో పవన్ ఏమో టిడిపికి మద్ధతు తెలపడం, బిజేపి ఏమో మద్ధతు తెలపకపోవడంతో పరిస్తితులు మారిపోయాయి. అసలు ఏం జరుగుతుందనేది అర్ధం కాకుండా ఉంది. ఇక బిజేపితో సంబంధం లేకుండా పవన్ మాత్రం టిడిపికి సపోర్ట్ చేయడం పై బిజేపి పెద్దలు ఎలా ముందుకెళ్తారనేది క్లారిటీ లేదు.
అయితే చంద్రబాబు..బిజేపి మద్ధతు కోసం ఎంతో ట్రై చేశారు..కానీ బిజేపి పెద్దలు జగన్‌కే సపోర్ట్ ఇస్తున్నారని తెలుస్తోంది. మళ్ళీ ఏపీలో జగనే అధికారంలోకి వస్తారని భావిస్తున్నారు. అందుకే బాబుకు బిజేపి పెద్దలు సపోర్ట్ ఇవ్వడం లేదని సమాచారం. కానీ ఇటు పవన్ బిజేపితో సంబంధం లేకుండా టిడిపికి సపోర్ట్ ఇచ్చారు. దీంతో పవన్-బిజేపికు దూరం అవుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఏపీ రాజకీయాలు కీలక మలుపులు తిరిగేలా ఉన్నాయి.