కేసీఆర్ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసన

-

తెలంగాణలో నిరుద్యోగ సమస్యలపై బీజేపీ చేపట్టిన 24 గంటల నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. ధర్నాచౌక్‌లో నిరసనకు దిగిన కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆయణ్ను ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. అక్కడే కిషన్ రెడ్డి తన దీక్షను కొనసాగిస్తున్నారు. నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కిషన్‌ రెడ్డి ఆక్షేపించారు.

కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేయడంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు బీజేపీ పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టనున్నారు. మరోవైపు కిషన్ రెడ్డి దీక్ష ఇవాళ ఉదయం 11 గంటల వరకు కొనసాగనుంది.

మరోవైపు కిషన్ రెడ్డి దీక్ష గురించి తెలుసుకున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కిషన్‌ రెడ్డిని ఫోన్‌లో పరామర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై పోరాటం కొనసాగించాలని అమిత్ షా కిషన్ రెడ్డికి సూచించారు. కేంద్ర పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news