నిజామాబాద్ వాసికి భార్య ప్ర‌స‌వం క‌ష్టాలు… 4 గురు బిల్ల‌లు… రు. 5 కోట్ల పిల్ల‌లు..

-

ఆ వ్య‌క్తి ఎంతో ముచ్చ‌ట‌ప‌డి త‌న భార్య‌ను విజిటింగ్ వీసాపై గ‌ల్ఫ‌కు ర‌ప్పించుకోవ‌డ‌మే అత‌డికి చుక్కలు చూపిస్తోంది. భార్య ఏకంగా న‌లుగురు పిల్ల‌ల‌కు జ‌న్మిన‌వ్వ‌డంతో పాటు ఇప్పుడు ఆమె వైద్యానికి రు. 5 కోట్లు ఖ‌ర్చ‌వ్వ‌డంతో ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి. అంత బిల్లు తానెక్కడ చెల్లించేదంటూ ఆ భర్త లబోదిబోమంటున్నాడు.

నిజామాబాద్‌కు జిల్లా కేంద్రంలోని మల్లపల్లికి చెందిన సయ్యద్‌ జహీద్‌. అతడు కొంతకాలంగా సౌదీలో పనిచేస్తున్నాడు. విజిటింగ్‌ వీసాపై ఏడాది క్రితం భార్యను సౌదీకి తీసుకొచ్చాడు. అక్క‌డే ఆమె గ‌ర్భం దాల్చింది ఏడో నెల‌లోనే ఆమెకు నెప్పులు రావ‌డంతో ఆమెను రియాద్‌లోని సులేమాన్‌ హబీబ్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె అనూహ్యంగా న‌లుగురు బిడ్డ‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది.

ఆస్పత్రి ఖర్చుల కోసం ఇప్పటికే దాచుకున్న రూ.4.31లక్షలను జహీద్‌ చెల్లించాడు. పిల్ల‌లు నెల‌లు నిండ‌కుండానే పుట్ట‌డంతో వాళ్ల‌ను ఇంక్యుబెట‌ర్ల‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రోజుకు న‌లుగురు పిల్ల‌ల‌కు క‌లిపి రోజుకు 10 వేల రియాళ్ల చొప్పున ఖర్చవుతోంది. అంటే.. రోజుకు నలుగురు పిల్లలకు కలిపి రూ.7 లక్షలు ఖర్చవుతోంది. ఇప్ప‌టికే ఈ న‌లుగురికి క‌లిపి రూ.4.50 కోట్లు ఖర్చయ్యింది. దీనికి తోడు మందుల ఖ‌ర్చుకు అద‌నం అట‌. దీంతో ఇప్పుడు జ‌హీద్‌కు ఏం చేయాలో తెలియ‌డం లేదు.

తన భార్య గర్భవతి అని తెలియగానే స్వదేశానికి పంపాలని అనుకున్నానని, అయితే ఎయిర్‌లైన్స్‌ అధికారులు అనుమతించలేదని.. ఇప్పుడు ఏం చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. రెండేళ్ల‌కే విజిటింగ్ వీసాల‌ను ప్ర‌భుత్వం జారీ చేస్తుండ‌డంతో ప‌లువురు త‌మ భార్య‌ల‌ను ఇక్క‌డ‌కు తీసుకు వ‌స్తున్నారు. ఇప్పుడు జ‌హీద్ కూడా త‌న భార్య‌ను ఇక్క‌డ‌కు తీసుకు వ‌చ్చి కాపురం చేసి ఇలా బుక్ అయ్యాడు. మ‌రి జ‌హీద్‌ను సౌదీ ప్ర‌భుత్వం ఎలా
ఆదుకుంటుందో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news