తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. అందుకే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఇక వరుసగా రెండు సార్లు కేసీఆర్ సారధ్యంలో అధికారంలోకి వచ్చిన పార్టీగా BRS ఉంది. ఇప్పుడు మూడవసారి కూడా కేసీఆర్ గెలిచి సీఎం కావాలని చాలా కసిగా ఉన్నారు. అందులో భాగంగా ఈనెల 29వ తేదీన కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా ఎన్నికలనే ప్రధాన అజెండాగా చర్చ జరపనున్నారు. అంటే కాకుండా కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ లు మరియు ఇతర కొత్త పథకాలపైన కూడా భేటీలో మాట్లాడనున్నారు. ఇక తాజాగా సమస్య ప్రభుత్వం ఇద్దరినీ ఎమ్మెల్సీ ల కోసం ప్రతిపాదించి గవర్నర్ కు పంపగా రాజ్యాంగం ప్రకారం వీరి ఎంపిక లేదని ఆమోదం తెలపలేదు. దీనిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక ఎన్నికలకు ముందు మంత్రులతో జరుపుతున్న ఈ మీటింగ్ చివరిదంటూ ప్రగతి భవన్ నుండి సమాచారం అందుతోంది. కాగా కేసీఆర్ మళ్ళీ తన పార్టీని గెలిపించుకుని సీఎంగా కొనసాగుతారా లేదా అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.