అమరావత ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో టీడీపీ ప్రధాన కార్యదర్శికి ఇవాళ ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ ఎలా ఉండాలి అనేది నారా లోకేశ్ కనుసన్ననలోనే జరిగింది అని ఆరోపించారు. నారా లోకేశ్ ఎఫ్ఐఆర్ లో ముద్దాయి.. తప్పు చేశాడు.. అప్పటి సీఎం తనయుడిగా ఆయనకు అన్నీ ముందస్తుగా తెలుసు.. అన్నీ తానై లోకేష్ నడిపించాడు.. హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ గా పలు భూములు కొనుగోలు చేశాడు అంటూ ఆయన అన్నారు. క్రిమినల్ మిస్ కాండక్ట్ గా ఆయన శిక్షార్హుడు.. 14 ఏళ్ళు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు ఇవన్నీ తెలియవా.. ప్రజల భూములను కారు చౌకగా కొనుగోలు చేశారు.. నమ్మి భూములు పేదలు, బలహీన వర్గాలను ఇచ్చిన వారిని నట్టేట ముంచాడు అని ఆదిమూలపు సురేష్ మండిపడ్డాడు.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది చేసి ఇస్తామని చంద్రబాబు, లోకేశ్ మోసాలకు పాల్పడ్డారు అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. లోకేశ్ ప్రజాధనాన్ని లూటీ చేశాడు.. దర్యాప్తు సంస్దలు విచారణకు రమ్మంటే తప్పించుకుని తిరుగుతున్నాడు.. నేషనల్ ఇష్యూ చేయాలని చూస్తున్నారు.. వాళ్లు ఎంత మంది కలిసి పొత్తులు పెట్టుకుంటారో మాకు అవసరం లేదు.. క్రిమినల్స్ కు మద్దతు ఇచ్చే వారి విషయాన్ని వాళ్లకు వదిలేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. ఏపీలో ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా.. మాకు భయం లేదు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలిచి అధికారం చేపడుతుంది అని ఆయన చెప్పారు.