లిఫ్ట్ ఉన్నప్పుడు మెట్లు ఎక్కడానికి ఎవరూ ఇష్టపడరు. అది ఫస్ట్ ఫ్లోర్ అయినా సరే.. లిఫ్ట్‌లోనే వెళ్తారు. కానీ మీరు అప్పుడప్పుడు చూసే ఉంటారు. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి గంటల తరబడి ఉన్నారు. ప్రాణాలతో పోరాడింది, నరకం అనుభవించింది లాంటి వార్తలను. మొన్ననే లిఫ్ట్‌లో ఓ చిన్నారి ఒక్కతే ఇరుక్కుపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు.. ఆ లిఫ్ట్‌లోంచి బయటరావడానికి నానా ప్రయత్నాలు చేసింది. లిఫ్ట్‌లో మీరు ఒక్కరే ఉన్నప్పుడు అది సడన్‌గా పనిచేయకుండా ఆగిపోతే ఏం చేయాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలో చూద్దాం.
మీ మనస్సును ప్రశాంతంగా ఉంచండి: లిఫ్ట్ అకస్మాత్తుగా ఆగిపోతే, భయపడవద్దు. అన్నింటిలో మొదటిది, మీరు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. చింతించటం, భయాందోళన చెందడానికి బదులుగా కూల్‌గా ఉండండి, ఏమి చేయాలో తెలుసుకోండి. ఎందుకంటే.. మీరు భయపడితే హార్ట్ బీట్ పెరుగుతుంది. ఆ టెన్షన్‌లో మీరు ఏం చేయాలో మీకు తెలియదు. బీపీ డౌన్ అయిపోచ్చు. ఎక్కువగా చెమటలు పట్టడం, కళ్లు తిరిగి కిందపడటం లాంటివి జరుగుతాయి. అందుకే.. మీకు మీరే ఏం కాదు ఏం కాదు అని సర్దిచెప్పుకుని ఫస్ట్ కూల్ అవ్వండి.
లిఫ్ట్‌లో నెట్‌వర్క్ ఉంటే సెక్యురిటీ నెంబర్ ఉంటే కాల్ చేయండి లేదా ఎవరో ఒకరికి కాల్ చేసి విషయం చెప్పండి.
లిఫ్టులు సాధారణంగా ఇంటర్‌కామ్ లేదా ఎమర్జెన్సీ బటన్‌ను కలిగి ఉంటాయి. మొబైల్ పని చేయకపోతే, బటన్‌ను నొక్కండి లేదా ఇంటర్‌కామ్ గార్డును సంప్రదించడానికి ప్రయత్నించండి.
లిఫ్ట్ సాంకేతిక లోపాలు సాధారణంగా తక్కువ సమయంలో సరి అవుతాయి. కాబట్టి ఓపికగా వేచి ఉండండి. టెక్నికల్ టీమ్ వచ్చి.. మిమ్మల్ని త్వరగానే బయటకు తీసుకొస్తారు.
లిఫ్ట్‌లలో ఓవర్‌హెడ్ ఫ్యాన్‌లు ఇన్‌స్టాల్ అయి ఉంటాయి. ఫ్యాన్ ఆన్ చేస్తే గాలి ప్రవహిస్తూ ఉంటుంది, శ్వాసకు ఇబ్బంది ఉండదు. చెమటలు పట్టవు.