జనసేన పార్టీచీఫ్ పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రేపు జరగాల్సిన జనసేన విస్తృత స్థాయి సమావేశం రద్దయింది. వచ్చే ఎన్నికల్లో పొత్తు నేపథ్యంలో… టీడీపీతో కలిసి క్షేత్ర స్థాయిలో వెళ్లే అంశంపై పార్టీ నేతలకు రేపటి సమావేశంలో పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేయాల్సి ఉంది. వైరల్ ఫీవర్ నేపథ్యంలో ఈ సమావేశం వాయిదా పడింది. సమావేశం తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తామని జనసేన ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో పవన్ కళ్యాణ్ నారా లోకేశ్ తో కలిసి చంద్రబాబు ను కలిశారు. ఏపీలోని అధికార పార్టీ అయిన వైసీపీని ఢీకొట్టేందుకు కార్యాచరణను రూపొందించాలని బాబు వారికి దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు జనసేన, టీడీపీ ఎన్నికల వర్కింగ్ టీమ్ రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల నేపథ్యంలో టీడీపీతో కలిసి క్షేత్ర స్థాయిలో జనసేన బరిలోకి దిగనుంది.