చంద్రబాబు ఆరోగ్యంపై ఎగతాళిగా మాట్లాడతారా..? : సీపీఐ నేత రామకృష్ణ

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు జైలులో అనారోగ్యంతో ఉన్నారని.. నారా భువనేశ్వరి మీడియాకి వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రులు, కీలక నేతలు, డీఐజీ చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని.. కేవలం 1 కేజీ మాత్రమే తగ్గారని చెప్పడం గమనార్హం. తాజాగా  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చంద్రబాబు గురించి మీడియాతో మాట్లాడారు. 

చంద్రబాబు ఆరోగ్యంపై రాజకీయం చేయడం సరికాదన్నారు.  ఆయన ఆరోగ్యం బాలేదంటే.. ఎగతాళిగా మాట్లాడతారా ? అని మండిపడ్డారు. ఆరోగ్యంపై వైద్యులు చెప్పాలి గానీ.. డీఐజీ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. మరోవైపు ఏపీలో నీటి పారుదల ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. కృష్ణా జలాల అంశంపై హర్షం వ్యక్తం చేస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సదస్సు పెడుతున్నారు. ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. కేంద్ర కేబినేట్ పున: పంపిణీకి నిర్ణయం తీసుకున్నప్పుడు సీఎం జగన్ ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో ఉండి మరీ దీనిని అడ్డుకోవడంలో జగన్ విఫలం అయ్యారు. తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెటటుకొని ఈ నిర్ణయం తీసుకున్నారని సీపీఐ రామకృష్ణ విమర్శించారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news