వాట్సప్‌లో కొత్త ఫీచర్‌.. గ్రూప్‌ కాల్‌ లిమిట్‌ పెంచేశారుగా..!

-

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సప్‌ ఎప్పటికప్పుడు ఏవో ఒక అప్డేట్స్‌తో తన వినియోగదారులను ఆకట్టుకుంటుంది. అప్పట్లో స్టేటస్‌ పెట్టుకునే ఆప్షన్‌ వచ్చినప్పటి నుంచి మొన్న వచ్చిన వాట్సప్‌ ఛానల్‌ వరకూ వాట్సప్‌ వినియోగదారులకు సర్‌ప్రైజ్‌లు ఇస్తూనే ఉంది. ఫార్మల్‌, ఇన్‌ఫార్మల్‌ కమ్యునికేషన్‌ కోసం చాలా మంది వాట్సప్‌నే వాడుతున్నారు. వాట్సాప్‌లో బాగా ప్రాచుర్యం పొందిన ఫీచర్స్‌లో గ్రూప్‌ కాలింగ్‌ ఒకటి. ఒకేసారి ఎక్కువ మంది యూజర్లు మాట్లాడుకునేందుకు గాను ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ ఫీచర్‌ను తీసుకొచ్చిన తొలి నాళ్లలో ఒకేసారి 7గురు మాట్లాడుకునేలా ఫీచర్‌ను తీసుకొచ్చారు. అనంతరం ఈ పరిమితిని 15కి పెంచుతూ నిర్ణయం తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ పరిమితిని మరోసారి పెంచుతూ వాట్సాప్‌ నిర్ణయం తీసుకుంది. ఈసారి ఏకంగా ఈ పరిమితిని 31 మందికి పెంచేసింది.

అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ను కేవలం ఐఓఎస్ యూజర్ల కోసం మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. మైక్రోసాఫ్ట్‌ మీట్‌, గూగుల్ మీట్‌ వంటి వాటికి పోటీగా ఈ ఫీచర్‌ ఉపయోగపడనుంది. ప్రస్తుతం ఐఓఎస్‌ వెర్షన్‌లో మాత్రమే ఈ ఫీచర్‌ను పరిచయం చేశారు. ఈ ఫీచర్‌ సహాయంతో ఒకేసారి 31 మంది గ్రూప్‌ కాల్‌ మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం యాపిల్‌ ఫోన్స్‌లోనే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ రానున్న రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్స్‌లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇంతకీ ఫీచర్‌ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..

  • గ్రూప్‌ కాల్‌ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే ముందుగా మీరు కాల్‌ చేయాలనుకుంటున్న గ్రూప్‌ చాట్‌ను ఓపెన్ చేయాలి.
  • అనంతరం స్క్రీన్ పైభాగంలో ఉన్న వీడియో కాల్ లేదా వాయిస్ కాల్ బటన్‌పై నొక్కాలి.
  • అనంతరం గ్రూప్‌ కాల్ చేయాలనుకుంటున్న ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఒకవేళ గ్రూప్‌లో 31 మందికంటే ఎక్కువ ఉంటే మీరు మాట్లాడుకోవాలనకుంటున్న 31 మందిని సెలెక్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
  • సభ్యులను ఎంచుకున్న తర్వాత వీడియో లేదా ఆడియో కాల్‌ బటన్‌పై నొక్కితే కాల్‌ని ప్రారంభించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news