ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మరో అయిదు నెలలలో రానున్నాయి. ఇందుకోసం అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలు యాత్రలు, పర్యటనలు, ర్యాలీల పేరుతో ప్రజలను ఆకర్శించడానికి తయారయ్యారు. అందులో భాగంగా రేపటి నుండి మరో రేణుడి రోజులు YSR జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను కాసేపటి క్రితమే సీఎంఓ ఆఫీస్ రిలీజ్ చేసింది. ఈ షెడ్యూల్ లో భాగంగా రేపు మధ్యాహ్నం 2 గంటలకు రాయచోటిలో మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానమ్ కుమారుడి పెళ్ళికి హాజరవనున్నారు. ఆ తర్వాత పులివెందులలో శ్రీకృష్ణ టెంపుల్ ను ప్రారంభించి, అక్కడే పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగం అవుతారు సీఎం జగన్.
అదే రోజు రాత్రికి ఇడుపులపాయలో విశ్రాంతి తీసుకుంటారు. ఆ పక్క రోజున ఉదయం RK ర్యాలీ, జమ్మలమడుగు పోలీస్ స్టేషన్ లను స్టార్ట్ చేస్తారు. ఆ మధ్యాహ్నం తాడేపల్లికి బయలు దేరి వెళ్తారు.