కాంగ్రెస్ వస్తే.. మళ్లీ దళారుల రాజ్యమే : కేసీఆర్

-

మహబూబ్‌నగర్‌ జిల్లాకు కాంగ్రెస్ రాజ్యంల పెండింగ్‌ ప్రాజెక్టుల జిల్లా అని పేరు పెట్టినారని సీఎం కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో అనేక బాధలు పడ్డమని, సాగు నీళ్లు, తాగు నీళ్లు లేవని, కరెంటు లేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తిలో ఇవాళ జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. ‘కాంగ్రెస్‌ పాలనలో పేదరికం, వలసపోవుడు, బతుక పోవుడే ఉండెనని అన్నారు. లాంబాడీ బిడ్డలు హైదరాబాద్‌లో ఆటోలు నడుపాల్సి వచ్చిందని చెప్పారు. ఇలా కాంగ్రెస్‌ పాలనలో అనేకమైన బాధలు అనుభవించినమని గుర్తుచేశారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చినంక పేదల సంక్షేమం, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు తెచ్చినం. పారిశ్రామిక విధానాన్ని, ఐటీ రంగ విధానాన్ని అద్భుతంగా తీసుకపోతున్నం. మరె కాంగ్రెసోళ్లు ఏమంటున్నరు..? కేసీఆర్‌ అనవసరంగ రైతుబంధు ఇస్తున్నడు అని మాట్లాడుతున్నరు. రైతు బంధు వేస్టా..? కాదు గదా..? కాబట్టి బీఆర్ఎస్‌ పార్టీని, జైపాల్‌ యాదవ్‌ను మళ్లీ గెలిపిస్తే రైతుబంధును ఎకరానికి రూ.16 వేలకు పెంచుతామన్నారు. మళ్లీ కాంగ్రెస్ వచ్చిందంటే.. మళ్లీ దళారుల రాజ్యం వస్తుందన్నారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news