తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ ఇన్ చార్జీగా ఠాక్రె బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకొచ్చింది. అయితే పక్కా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా దీప దాస్ మున్షి ని నియమించారు.
తెలంగాణ ఇన్ చార్జీగా ఉన్నటువంటి మాణిక్ రావు ఠాక్రే కి కీలక బాధ్యతలను అప్పగించారు. ఈయన స్థానంలో మున్షీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం లో మున్షీ పరిశీలకురాలిగా పని చేశారు. అలాగే కేరళ,లక్షద్వీప్‌లో కూడా దీప్ దాస్‌మున్షికి పార్టీ పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించింది. ఠాక్రేకు గోవా, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలి ఇన్‌ఛార్జ్ గా బాధ్యతలు ఇచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా మాణిక్ రావు ఠాక్రేను నియమించింది అధిష్టానం.