నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది.. 2019లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండే పది అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకొని తమ బలాన్ని చాటుకుంది.. ఇంకా ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను రిపీట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.. రాజ్యసభ సభ్యులుగా, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నవేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు.. ఈ మధ్యకాలంలో ఆయన టిడిపిలోకి వెళ్ళబోతున్నారంటూ కొన్ని మీడియా ఛానల్స్ విపరీతంగా ప్రచారం చేసాయి..
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని.. ఈ క్రమంలోనే విపిఆర్ టిడిపి నేతలతో టచ్ లో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారాలకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టారు.. నెల్లూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. అవన్నీ విని విసిగి వేసారి పోయానని వ్యాఖ్యానించారు..
తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న ప్రచారాలన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడం తద్యమని వెల్లడించారు..వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన ప్రకటనపై వైసీపీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు. టిడిపి నేతలు కొన్ని మీడియా సంస్థలు VPR పై అసత్య ప్రచారాలు చేశారని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంటామని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘంటాపదంగా చెబుతున్నారు..