గోరంట్ల బుచ్చయ్య: అక్కడ పనికిరాడు.. ఇక్కడ పోటీ ఎందుకు..?

-

చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పోటీపై టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన కామెంట్స్ చేశారు. రామచంద్రపురం లో పనికిరాని మంత్రి రాజమండ్రి రూరల్ లో పోటీకి పనికి వస్తాడ అంటూ ఆరోపించారు. రాజమండ్రి రూరల్ వైసిపి అభ్యర్థి చల్లబోయిన వేణుగోపాలకృష్ణ పోటీ పై మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టికెట్ ఎక్కడ ఇచ్చినా కూడా పోటీ చేస్తానని అన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని టిడిపి అధిష్టానం ఎప్పుడో ప్రకటించింది అన్నారు.

ఇప్పుడు ఉండదని చెప్పడానికి జనసేన నాయకుడు ఎవరు అంటూ అగ్రహాన్ని వ్యక్తపరిచారు జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందులు దుర్గేష్ చేసిన కామెంట్స్ పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్ అయ్యారు. దుర్గేష్ తో వ్యక్తిగతంగా విభేదాలు లేవని అధిష్టానం నిర్ణయం మేరకు త్యాగానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. టికెట్ ఎవరికిచ్చినా టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థులని గెలుపు ఖాయమని అన్నారు. ఓటమితో అవినీతిపరులైన మంత్రులు అధికారులు ఇతర దేశాలకి పారిపోవడానికి ట్రై చేస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news