తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడు కావలెను! అనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేంద్రంలో వరుస విజయాలు సొంతం చేసుకుని అధికారంలోకి వచ్చిన పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లోనూ పట్టు సాధించేందుకు అనేక ప్రయ త్నాలు చేస్తోంది దీనిలో భాగంగా తెలంగాణలో ఏకంగా అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. అ సెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒకరు గెలిచినా పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే కోణం నుంచి మా త్రం బయటకు రాలేదు. ఇక, ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున నలుగురు ఎంపీలు గెలు పు గుర్రం ఎక్కడం, వారిలో కిషన్ రెడ్డికి మంత్రి పదవి కూడా దక్కడం తెలిసిందే.
ఇక ఇప్పుడు తెలంగాణ అధ్యక్ష పదవిలో ఉన్న లక్ష్మణ్‌కు గడువు తీరింది. ఈ క్రమంలో పార్టీ లైన్ ప్రకా రం కొత్తవారికి పగ్గాలు అప్పగించాలి. అయితే, పార్టీని ముందుండి నడిపించి, వచ్చే ఎన్నికల నాటికి రా ష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా చేయగలిగే నాయకుడి కోసం కమల నాథులు వెతుకుతున్నారు. ప్రస్తుతం మాక్కావాలంటే మాక్కావాలంటూ.. పార్టీ అధ్యక్ష పీఠం కోసం నాయకులు కొత్తవారు, పాత వారు కూడా పోటీ పడుతున్నారు. అయితే, వీరిలో ఎవరికి ఇచ్చినా.. పార్టీ పరిస్థితి మెరుగవుతుందా? అనే సందేహం మాత్రం వ్యక్తమవుతోంది. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‌నే కొనసాగించడం బెటరనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
ఇప్పటికిప్పుడు ఉన్నఅంచనాల ప్రకారం.. కొత్తగా పార్టీలోకి వచ్చిన డీకే అరుణ, జితేందర్ రెడ్డి లు కూడా అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టు బడుతున్నారు. డీకే అరుణకు మాజీ మంత్రిగా చేసిన అనుభవంతో పాటు ఫైర్ బ్రాండ్ అనే పేరు కూడా ఉంది. అయితే, ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాలు, బీజేపీ వ్యూహాలు, నాయకులను కలుపుకొని పోవడం అనే విషయాలే మైనస్‌గా ఉన్నాయి, ఇక, జితేందర్ పరిస్థితి కూడా దీనికి భిన్నం ఏమీ కాదు. దీంతో ఈ ఇద్దరి పేర్లు తొలి వడపోతలోనే పక్కకు పోయే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. వీరితో పాటు బీజేపీ లోని కొందరు సీనియర్లు కూడా అధ్యక్ష పగ్గాలు ఆశిస్తున్నారు.
రఘునందన్ రావు, కృష్ణ సాగర్, మురళీధర్ రావు పోటీ పడుతున్నారు. కృష్ణ సాగర్ కు అధ్యక్ష పదవి ఇవ్వడానికి కేంద్ర పార్టీ సిద్ధంగా లేదు. రఘునందన్ విషయంలో రాష్ట్ర పార్టీలో విభేదాలు ఉన్నాయని బీజేపీ నేతలు అంటున్నారు. ఇక, మురళీధర్‌రావుకు ఇచ్చినా.. పార్టీ పరిస్థితి మెరుగవుతుందనే ఆశలు లేవని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ పగ్గాలు ఎవరికి అప్పగించాలనే అంశం ఇప్పటికీ ముడి పడలేదు. దీంతో లక్ష్మణ్‌ను కొనసాగించడమే బెటరని కేంద్రంలోని కమల నాథులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.