చరిత్ర మరిచిన కమలం… ఇప్పుడు కొత్త మాటలు మాట్లాడుతుంది…!

-

2017 అయిదు రాష్ట్రాల ఎన్నికలు… బిజెపి మూడు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది… గోవాలో అధికారం చేపట్టే అవకాశం లేకుండా పోయింది. కాని స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు… అనుకున్నదే తడవుగా స్వతంత్ర ఎమ్మెల్యేల చేత ఒక ప్రకటన వచ్చింది… రక్షణ శాఖా మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్… గోవా ముఖ్యమంత్రి అయితే తాము బిజెపికి మద్దతు ఇస్తామన్నారు వాళ్ళు… అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ని కాదన్న గవర్నర్… బిజెపి, స్వాతంత్ర్య ఎమ్మెల్యేలను పిలిచారు…

రక్షణ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన పారికర్ గోవా ముఖ్యమంత్రి అయ్యారు. బీహార్ లో 2017 లో జెడియు, ఆర్జెడి కూటమి పచ్చగా ప్రభుత్వాన్ని నడిపిస్తుంది… తేజస్వి యాదవ్ ని బూచిగా చూపించి… ఆయన అవినీతిని బయటపెట్టి పొత్తు విడగొట్టి… తమ మద్దతుతో జేడియు ని అధికార పీఠంపై కూర్చోపెట్టింది… కర్ణాటకలో జెడిఎస్ కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టడానికి సిద్దమయ్యాయి… హడావుడిగా వాళ్ళకంటే ముందుగా యడ్యురప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు… ఎమ్మెల్యేలతో మాట్లాడే ప్రయత్నం చేసారు… 

ఫోన్ లు చేసారు… ఆఫర్లు ఇచ్చారు పని జరగలేదు. బలపరీక్షకు ముందే రాజీనామా చేసారు. అప్పటి నుంచి ఏడాది పాటు కాంగ్రెస్ జెడిఎస్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు బిజెపికి నిద్రపట్టలేదు… 17 మంది ఎమ్మెల్యేల సహాయంతో ప్రభుత్వాన్ని కూల్చింది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా హర్యానాలో అధికారం చేపట్టడానికి జేజేపి మద్దతు కోసం ప్రయత్నాలు చేసింది. బిజెపి వెంటాడింది… జేజేపి అధినేత దుష్యంత్ చౌతాలాతో మాట్లాడింది… ఆయన ఉప ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖత్తర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.

చెప్పుకుంటూ పొతే భారతం అంత ఉంటుంది… అస్సాం, మణిపూర్, సహా అనేక రాష్ట్రాల్లో అధికారం కోసం బిజెపి ఆడిన పవర్ డ్రామాలు అన్నీ ఇన్నీ కావు… ఇప్పుడు మహారాష్ట్రలో అదే ప్రయత్నం చేసి బొక్క బోర్లా పడింది… పవార్ చేత కంగుతింది… ఫడ్నవీస్ మాట్లాడుతూ… మాది ఫిరాయింపుల తత్వం కాదు, విపక్షంలో కూర్చుంటాం, అధికారం కోసం కక్కుర్తి పడం అని మాట్లాడుతూ హిందుత్వ వాదం కాంగ్రెస్ అధినేత్రి సోనియా కాళ్ళ ముందు ఉందీ అంటూ మాట్లాడారు… పంజాబ్ లో ఎన్నికలకు ముందు బిజెపి వేర్పాటు వాద పార్టీతో పొత్తు పెట్టుకుంది,

అసోం లో కూడా అదే జరిగింది… నాగాలాండ్ లో బోడో ల్యాండ్ కి మద్దతు ఇచ్చే పార్టీకి మద్దతు ఇచ్చింది… హిందుత్వ వాదం గురించి మాట్లాడే బిజెపి నేతలు… జమ్మూ కాశ్మీర్ లో అధికారం కోసం ముస్లిం పార్టీకి మద్దతు ఇచ్చారు… ఇలా ఒకటి కాదు రెండు కాదు… 30 ఏళ్ళ శివసేన పొత్తులో సంకీర్ణ పక్షంగా ఆ పార్టీ ఉండటమే గాని అధికారం రుచి చూసిన పాపాన పోలేదు… ఎన్నికలకు ముందు ఆ పార్టీ పదవి అడిగిన మాట నిజం అనేది అందరికి తెలుసు… ఇప్పుడు బిజెపి నీతలు చెప్పడం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం నిజంగా విడ్డూరం అనేది రాజకీయ పరిశీలకుల వ్యాఖ్య.

Read more RELATED
Recommended to you

Latest news