మందుబాబులకు దిమ్మతిరిగే షాక్.. ఫస్ట్ టైమ్ దొరికినా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..

-

సాధార‌ణంగా తాగి వాహనం నడుపుతూ మూడు సార్లు పట్టుబడితే సీరియస్ గా యాక్షన్ తీసుకునే వారు. ఆ త‌ర్వాత డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేవారు. డ్రంకెన్ డ్రైవింగ్ లో ఫస్ట్ టైమ్ దొరికితే.. ఫైన్ వేసి వదిలేసే వారు. కానీ ఇప్పుడు మాత్రం మందుబాబులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు సైబరాబాద్ పోలీసులు. తాగుబోతులను కట్టడి చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాగి వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడినా.. ఆ వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు.

ఎన్ని వార్నింగ్ లు ఇస్తున్నా, ఫైన్లు వేస్తున్నా, జైలుకి పంపిస్తున్నా.. హైదరాబాద్ నగరంలో మందుబాబుల్లో మార్పు రావడం లేదు. డ్రింక్ చేసి వాహనాలు నడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు కారణం అవుతున్నారు. వారి ప్రాణాలు పొగొట్టుకోవడమే కాకుండా అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్ల జరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే సైబరాబాద్ పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అయ్యారు. సో.. బీకేర్‌ఫుల్‌..!

Read more RELATED
Recommended to you

Latest news