మీ బిడ్డనంటున్న సీఎం జగన్ పట్ల ప్రజలు జర జాగ్రత్తగా ఉండాలని తెలుగు దేశం పార్టీ జాతీయ
ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన సొంత కంపెనీలు కళకళలాడితే.. రాష్ట్ర ఖజానా దివాలా తీసిందన్నారు. ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీ తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని సీఎం.. అప్పులు తేవడంలో మాత్రం పీహెచ్సీ చేశారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు లోకేశ్ ఎక్స్ (ట్విటర్) లో పోస్ట్ చేశారు.
“రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయాన్ని రూ.370 కోట్లకు జగన్ తాకట్టుపెట్టారు. ఖనిజ సంపద తనఖాతో రూ.7వేల కోట్లు.. మందుబాబులను తాకట్టు పెట్టి రూ. 33వేల కోట్ల అప్పులు తెచ్చారు. ఆయన పాలనలో ఇక మిగిలింది 5 కోట్ల మంది జనం మాత్రమే. ఇప్పటికీ తాను మీ బిడ్డనంటూ వేదికలపై ఊదరగొడుతున్న జగన్ మాటల వెనుక ఆంతర్యాన్ని ప్రజలు గుర్తించాలి. రానున్న 2 నెలలు ఆయనతో జాగ్రత్తగా ఉండాలి” అని లోకేష్ పేర్కొన్నారు.