నేను గొర్రెను కాను, కాలేను : RS ప్రవీణ్ కుమార్ సంచలనం

-

నేను గొర్రెను కాను అంటూ RS ప్రవీణ్ కుమార్ సంచలన పోస్ట్‌ పెట్టారు. నేడు కడియం, కేకే గార్లు అకస్మాత్తుగా బీఆర్‌ఎస్‌ ను వీడటంతో నాకు కొంత మంది కాల్ చేసి వారి బాటలోనే నడచి ‘మంచి’ దారి వెతుక్కోమన్నరు. మరి కొంత మంది బీఆరెస్ కార్యకర్తలు పార్టీని వీడొద్దు, ఈ పరిస్థితుల్లో పార్టీకి అండగా నిలబడాలని కోరారని తెలిపారు. ప్రియమైన మిత్రులారా, దయచేసి ఎవరూ టెన్షన్ పడకండి. నేను గొర్రెను కాను. కాలేను… ఇంకెక్కడికో పోవాలన్న ఆలోచన కూడా లేదు.

RS Praveen Kumar’s sensational comments on the Centre

ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీని వీడనని పేర్కొన్నారు. నేను గతంలో చేసిన బీయస్పీ-బీఆరెస్ కూటమి ప్రయత్నం కానీ, తర్వాత బీఆరెస్ లో చేరాలన్న నిర్ణయం కానీ చాలా ఆలోచించి తీసుకున్నాని తెలిపారు. మళ్లీ చెబుతున్న, నేను రాజకీయాల్లోకి వచ్చింది నా స్వంత పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసమో, అక్రమ ఆస్తుల కోసమో, పోలీసు కేసులకు భయపడో, హంగులు, ఆర్భాటాలున్న జీవితం కోసమో, ప్రోటోకాల్ కోసమో కాదన్నారు. KCR గారి నాయకత్వంలో నడుస్తున్న బలమైన బీఆర్‌ఎస్‌ పార్టీని నేను వేదికగా ఎంచుకున్నానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news