జిత్తులమారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం : సీఎం జగన్

-

మోసాలే అలవాటుగా, అబద్దాలే పునాదులుగా చేసుకున్న జిత్తుల మారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇవాళ చిత్తూరు జిల్లా మదనపల్లెలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మాట్లాడారు జగన్. పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలకు మంచి చేసిన ఫ్యాన్ మీ ఇంట్లోనే ఉంటుంది. ప్రజలను పదే పదే మోసం చేసిన సైకిల్ ఇంటి బయటే ఉంటుంది.

తాగేసిన గ్లాస్ సింక్ లో ఉంటుంది. ఆ జిత్తుల ముఠా ఎన్ని చేసినా.. ఎంత ప్రయత్నించినా ప్రజలకు మనం చెప్పాల్సింది.. ఒక్కటే ఒక్కటి.. ఈ ఓటు కేవలం ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు. మన భవిష్యత్, తల రాతలు మీరు వేసే ఓటు మీద ఆధారపడి ఉందని చెప్పండి. పేద వాడి భవిష్యత్ బాగుపడడానికి మళ్లీ జగన్ అన్నే రావాలని ప్రతీ గడపకు వెళ్లి చెప్పండి. అరుంధతి సినిమాలో సమాధి నుంచి లేచిన పశుపతి లాగా.. ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు అనే పసుపు పతి వస్తున్నారు. వదల బొమ్మాళీ వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు కేకలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news