ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఇప్పుడు చాలా రసవత్తరంగా మారాయి. ఓ వైపు అధికార పార్టీ మేమంతా సిద్ధం సభలతో సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు.మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ముద్రగడ పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. ముఖ్యంగా పిఠాపురంలో పవన్‌ను ఓడించి సినిమా హీరోలు రాజకీయాల్లోకి రాకుండా చేయాలన్నారు. నువ్వు లండన్‌లో షూటింగ్ చేసుకుంటుంటే.. ప్రజలకు కష్టమొస్తే నీకు అక్కడకు వచ్చి చెప్పుకోవాలా? అంటూ పవన్‌పై విమర్శలు చేశారు.
పవన్ కళ్యాణ్ ని నమ్మితే సినిమా చూపిస్తాడు. సంవత్సరానికి, ఆరు నెలలకొకసారి వచ్చి హలో అనే పవన్ కు ఓటు వేయాలా..? అని ప్రశ్నించారు. జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థులకు పవన్ తన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదన్నారు. పవన్ ను ఓడిస్తే.. జీవితంలో మళ్లీ సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడానికి సాహసం చేయరన్నారు. ప్రజలకు సేవ చేయడానికి ఎమ్మెల్యే పదవులు కాదు.. వారు సినిమా షూటింగ్ చేసుకోవడానికి ఎమ్మెల్యే పదవులు అని పేర్కొన్నారు.