అసెంబ్లీ గేటు దగ్గర చీఫ్ మార్షల్ దారుణంగా ప్రవర్తించారని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల అనుచితంగా వ్యవహరించారన్నారు. ప్లకార్డులు, బ్యానర్లు, నల్ల రిబ్బన్లు వద్దంటున్నారని.. చివరికి కాగితాలు కూడా తీసుకెళ్లనీయడం లేదని బాబు మండిపడ్డారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విపక్ష నేతగా ఉన్న సమయంలో అసెంబ్లీలో తన చాంబర్ అద్దాలు పగలుగొట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు అవాస్తవమని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చెప్పుకొచ్చారు.
అలాగే చంద్రబాబు చాంబర్ అద్దాలను వైఎస్ పగలగొట్టలేదన్నారు. సీఎంను కలిసేందుకు వెళ్తున్న మమ్మల్ని మార్షల్స్ అడ్డుకున్నారని.. ఎథిక్స్ కమిటీ విచారణలో మా తప్పు లేదని తేలిందన్నారు. సభ సజావుగా జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారన్నారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికాదని.. ఆ మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. సభా వ్యవహారాలపై ఎథిక్స్ కమిటీ వేయాలని ఈ సందర్భంగా స్పీకర్‌ను ఆనం కోరారు.