పార్లమెంటు ఎన్నికల తరువాత వాళ్ళిద్దరూ కనిపించరు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

-

మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల తర్వాత ఈటల రాజేందర్, సునీతా మహేందర్ రెడ్డి కనిపించరని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసే ఉంటే.. కవితను జైలులో ఎందుకు వేస్తారని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.

ఉత్తరప్రదేశ్ లో బీజేపీపై పోరాడలేక రాహుల్ గాంధీ ఆమేథీ నుండి కేరళలోని వయనాడు పోరిపోయారన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుండి రేవంత్ రెడ్డి కేవలం 5 వేల ఓట్ల మెజార్టీతోనే గెలిచారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి అన్నీ ఇచ్చిందని.. కానీ ఆయన మాత్రం ఐదేళ్లలో మల్కాజిగిరి కోసం ఏమి చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను 10 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే దేశ రాజకీయాలను శాసిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news