రైతులకు పార్లమెంట్ సాక్షిగా మోడీ క్షమాపణ చెప్పాలి.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

-

రైతులకు పార్లమెంట్ సాక్షిగా మోడీ క్షమాపణ చెప్పాలని.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా గాంధీ భవన్ లో  బీజేపీపై కాంగ్రెస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆగర్ బత్తీలను కూడా వదలకుండా జీఎస్టీ విధించారు. చివరికీ చిన్నపిల్లలు వాడే పెన్సిల్ పై కూడా మోడీ జీఎస్టీ విధించాడని పేర్కొన్నారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోడీ సర్కార్ మోసం చేసిందన్నారు. పదేళ్లలో కేవలం 7లక్షల పై చిలుకు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. అదానీ, అంబానీ, అమెజాన్ ఒత్తిడులకు మోడీ సర్కార్ తలొగ్గిందని తెలిపారు. రైతులకు పార్లమెంట్ సాక్షిగా మోడీ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ప్రతీ పేదవాడి ఖాతాలో రూ.15లక్షలు వేస్తానన్న మోడీ.. కనీసం 15 పైసలు కూడా వేయలేదన్నారు. కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో సంపాదించిందంతా.. మోడీ పదేళ్లలోనే మొత్తం ప్రయివేటు పరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news