ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌తో జగన్ ప్రభుత్వం భూములు దోచుకునేందుకు కుట్ర : చంద్రబాబు

-

ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌తో జగన్ ప్రభుత్వం భూములు దోచుకునేందుకు కుట్ర పన్నిందని టీడీపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు.మన భూములు మనకు దక్కకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజల ఆస్తులు దోచుకునేందుకు కుట్ర పన్నారని విమర్శించారు.

నంద్యాల జిల్లాలోని డోన్‌లో ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.ఈ 5 సంవత్సరాలలో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ 5 సంవత్సరాల పాలనలో ఆంధ్ర ప్రదేశ్ సర్వనాశనమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. రైతు కూలీలు దీనావస్థలో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. హార్టికల్చర్‌ను నిర్వీర్యం చేశారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news