అయ్యో పీవీ రమేష్….ఎల్లోమీడియా ట్రాప్ లో పడితే అంతే..

-

వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై బురద చల్లేందుకు ఎల్లో మీడియా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగో గెలవలేమని తెలిసి అడ్డదారులు తొక్కుతున్నారు.టీడీపీకి అనుకూలంగా ఉన్న మాజీ అధికారులు కూడా వైసీపీ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్…ప్రభుత్వం మీద మనసులో ఏదో పెట్టుకుని ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ఏదేదో పోస్ట్ చేసేసి మళ్ళీ చెరిపేసి..మళ్ళీ రాసేసి….. ఏదేదో చేద్దాం అనుకుని చివరికి బొక్కబోర్లా పడ్డారు.ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అసలు ఏం జరిగిందంటే….తన స్వగ్రామంలో ఉన్న భూమికి సంబంధించి మ్యుటేషన్ జరగలేదని ట్వీట్ చేస్తూ..తన ఆవేదన వెళ్లగక్కారు పీవీ రమేష్.అంతలోనే మళ్ళీ దాన్ని సరిదిద్దేసి ఇంకా ఆ ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి రాకముందే ఇలా జరిగింది అంటూ ఇంకో రెండు పదాలు కలిపి మళ్ళీ పోస్ట్ చేసారు. దీంతో కొందరు దానికి సమాధానంగా అసలు ఆ చట్టం అమల్లోకి రాకపోతే నీకెలా అన్యాయం జరుగుతుంది… అంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో అయన సమాధానం ఇవ్వలేక సైలెంట్ అయ్యారు.

ఇదిలా ఉండగా కృష్ణ జిల్లా విన్నకోట గ్రామంలో తనకు వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించి ఉన్న సమస్య మీద ఆయనకు అధికారులు వివరణ ఇచ్చారు. ఆ భూమిలో పీవీ రమేష్ తో బాటు అయన సోదరులకు కూడా భాగం ఉందని, ఈ క్రమంలో భూమి మ్యుటేషన్ కోసం వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మ్యూటేషన్ కోసం పలు పత్రాలు సమర్పించాల్సి ఉండగా రమేష్ అవేమి చూపించకుండా దరఖాస్తు చేసారని,అందుకే ఆ ప్రక్రియ ముందుకు సాగలేదని తహసీల్దార్ తేల్చేసారు.దీంతో అనవసరంగా ఎల్లో మీడియా ట్రాప్ లో పడి పరువుపోగొట్టుకున్నారని ఆయన్ను నెటిజన్స్ విమర్శిస్తున్నారు.తన దగ్గర తప్పు పెట్టుకుని ప్రభుత్వంపై బురద చల్లాలనుకోవడం తగదని వైసీపీ అభిమానులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news